Lifestyle
రోజ్మేరీ వాటర్ జుట్టకు ఎంతో మేలు చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి కొంతమంది ఈ వాటర్ ను తాగితే, మరికొంతమంది రోజ్మేరీ నూనెను ఉపయోగిస్తుంటారు.
రోజ్మేరీ మన జుట్టును బలంగా చేయడానికి, చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉంటానికి బాగా సహాయపడుతుంది. రోజ్మేరీ నూనె వాడితే చుండ్రు సమస్య లేకుండా పోతుంది.
మీరు జుట్టు పెరగడానికి రోజ్మేరీ నూనెను లేదా వాటర్ ను ఉపయోగించొచ్చు. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టును హెల్తీగా ఉంచుతాయి.
రోజ్మేరీలో మన జుట్టును తేమగా ఉంచడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అలాగే దీన్ని వాడటం వల్ల జుట్టు మూలలు బలంగా అవుతాయి.
జుట్టుకు రోజ్మేరీ ఆయిల్ ను పెట్టడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీ జుట్టు బాగా పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలకు తేమను అందిస్తాయి.
రోజ్మేరీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. ఇవి జుట్టు చివర్లు పగిలిపోకుండా కాపాడుతాయి. అలాగే ఈ రోజ్మేరీ ఆయిల్ ను పెట్టడం వల్ల నెత్తిమీద దురద, చుండ్రు తగ్గుతాయి.