Lifestyle

మందు తాగితే రాత్రి జరిగింది ఏం గుర్తుండదా?

మందు తాగితే మత్తుగా ఎందుకు ఉంటుంది?

ఆల్కహాల్ తాగిన వారు మత్తుగా ఉంటారు. మందు తాగిన తర్వాత తల తిరిగినట్టుగా కూడా అనిపిస్తుందట. అందుకే ఈ సమయంలో వారికి ఏం చేస్తున్నామో కూడా తెలియదు. 

ఆల్కహాల్ ప్రభావం

 ఆల్కహాల్ ఫస్ట్ మీ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు దెబ్బతిని, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చాలా వరకు తగ్గుతుంది.

ఆల్కహాల్

మందు ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ప్రతిరోజూ మందు తాగే వ్యక్తి బ్లాక్ అవుట్ కు గురవుతాడు. అంటే మందు తాగిన మత్తులో ఏం జరిగినా గుర్తుండదు. 

జ్ఞాపకశక్తి కోల్పోవడం

నిపుణుల ప్రకారం.. మందు మీ మెదడు విషయాలను నిల్వ చేసే ప్రక్రియను ఆపుచేస్తుంది. దీంతో మీకు విషయాలను గుర్తించుకునే సామర్థ్యం తగ్గుతుంది. 

నాడీ వ్యవస్థ అసమతుల్యత

 మందును తాగితే GABA లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఇవి న్యూరో ట్రాన్స్మీటర్లు. ఇది మీ బ్రెయిన్ ను ప్రశాంతంగా ఉంచుతుంది. 

ఆలోచనా శక్తి తగ్గుదల

నిపుణుల ప్రకారం.. GABA గ్లూటామేట్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. దీనివల్ల మీరు ఆలోచించే శక్తి చాలా వరకు తగ్గుతుంది. అంటే మత్తులో మీరు దేనిగురించి ఎక్కువగా ఆలోచించలేరు. 

శరీరంలో నీటి శాతం తగ్గుదల

ఆల్కహాల్ ను తాగడం వల్ల మీ  శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అంటే మందు మీ శరీరంలోని నీటిని బయటకు పంపుతుంది. దీంతో మీకు అలసట. తలనొప్పి, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయి. 

శారీరక ఆరోగ్యంపై ప్రభావం

మందు తాగివారి మెదడులో న్యూరాన్స్ పరిమాణం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే దీనివల్ల మీ మెమోరీ పవర్ తగ్గుతుంది. 

రక్తంలో చక్కెర స్థాయి తగ్గుదల

అంతేకాదు మందు తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో మీ శరీరంలో శక్తి స్థాయిలు తగ్గుతాయి. చిరాకు కలుగుతుంది. 

మందు

మందును ఎక్కువగా తాగేవారు ఇతరులతో తొందరగా కలిపిసోతారు. అంతేకాదు నిర్లక్ష్యంగా కూడా ఉంటారు. వీరికి వాళ్లపై నియంత్రణ అసలే ఉండదు. తాగుతూనే ఉంటారు.

అల్జీమర్స్ సమస్య

ప్రతిరోజూ మందును తాగడం మంచిది కాదు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అలాగే వీరికి అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.

ఈ నీళ్లు తాగితే జుట్టు ఊడిపోదు, వెంట్రుకలు తెల్లగా కావు

మీ వయసు 30 దాటిందా? కచ్చితంగా తినాల్సినవి ఇవే

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు చాలు

ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా