బరువు తగ్గాలనుకునేవారికి ఆకుకూరలు చాలా మంచిది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండటమే కాకుండా.. విటమిన్ ఎ, సి, కె వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి.
క్యాబేజీలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. 100 గ్రాముల క్యాబేజీలో 25 క్యాలరీలు ఉంటాయి.
బీట్రూట్ లో ఫైబర్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజు బీట్రూట్ (సుమారు 80 గ్రాములు) లో 34 క్యాలరీలు ఉంటాయి.
వంకాయలో క్యాలరీలు తక్కువ. 100 గ్రాముల్లో 25 క్యాలరీలు ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె, మెదడు ఆరోగ్యానికి మంచివి.
అధిక బరువును నియంత్రించడానికి ముల్లంగి సహాయపడుతుంది. వీటిలో క్యాలరీలు చాలా తక్కువ. నీటి శాతం ఎక్కువ.
ఫైబర్, విటమిన్ కె, విటమిన్ సి ఉన్న బీన్స్ బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
దోసకాయలో ఎక్కువగా నీరు ఉండటం వల్ల అవి హైడ్రేటింగ్ గా ఉంటాయి. ఒక కప్పు తరిగిన దోసకాయ (సుమారు 120 గ్రాములు) 18 క్యాలరీలను కలిగి ఉంటుంది.
బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇవి తింటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భయం ఉండదు
మిగిలిన ఆహారం పాడవ్వకూడదంటే ఏం చేయాలో తెలుసా?
అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Kitchen Hacks: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే?