పనికిరావని పారేయకండి.. నిమ్మతొక్కలను ఇందుకోసం కూడా ఉపయోగించొచ్చు
మంచి వాసన
ఇవి ఫుడ్ ను టేస్టీగా చేయడంతో పాటుగా మంచివాసన వచ్చేలా చేస్తుంది. ఇందుకోసం ఈ తొక్కల్ని పొడి చేసి బేకరీ ఫుడ్,సలాడ్ డ్రెస్సింగ్‌లు లేదా నూడుల్స్ , పానీయాల్లో వేసుకోవచ్చు.
ఇంట్లో మంచి వాసన
నిమ్మతొక్కలతో ఇంట్లో మంచి వాసన వచ్చేలా చేయొచ్చు. ఇందుకోసం నిమ్మ తొక్కలు, దాల్చిన చెక్క లేదా లవంగాలు నీళ్లలో వేసి మరిగించి స్ప్రే చేయండి.
మ్యాజిక్ క్లీనర్
నిమ్మతొక్కలు మంచి క్లీనర్ గా కూడా పనిచేస్తాయి. ఇందుకోసం ఒక జార్‌లో నిమ్మ తొక్కలు, వైట్ వెనిగర్ వేసి వారం పాటు ఉంచండి. దీన్ని కిచెన్, బాత్రం లో స్ప్రే చేసి శుభ్రం చేయండి.
పానీయాలకు కొత్త లుక్
డ్రింక్స్ కు నిమ్మతొక్కలు మంచి లుక్ ను ఇస్తాయి. ఇందుకోసం వీటిని ఐస్ ట్రేలో ఉంచి ఫ్రీజ్ చేయండి. ఈ ఐస్ క్యూబ్స్‌ని వాటర్, ఐస్ టీ లేదా కాక్‌టెయిల్స్‌లో వేసుకుని తాగండి.
మైక్రోవేవ్ శుభ్రత
నిమ్మతొక్కలతో మైక్రోవేవ్ ను కూడా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నిమ్మతొక్కలు, నీళ్లు పోసి మైక్రోవేవ్‌లో 2 నిమిషాలు వేడి చేయండి. ఈ ఆవిరితో మైక్రోవేవ్ కొత్తదానిలా అవుతుంది.