Lifestyle
చియా సీడ్స్ లో ప్రోటీన్లు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి.
ఈ గింజల్లో జింక్, కాల్షియం, ఇనుముతో పాటగుా ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి.
చియా గింజలను ఎలా తినాలో తెలుసా?
ఇది చాలా సులువైన పద్దతి. దీనికోసం ఒక గ్లాసు నీటిలో 1,2 టేబుల్ స్పూన్లు చియా గింజలను వేసి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టి తాగండి.
మీరు చియా సీడ్స్ ను తాజా పండ్లలో కలిపి కూడా తీసుకోవచ్చు. బెర్రీలు, సిట్రస్ పండ్లలో తీసుకుంటే మంచిది.
కొబ్బరి నీళ్లలో చీయా సీడ్స్ ను నానబెట్టి కూడా తాగొచ్చు.
చామంతి లేదా తులసి టీ తయారుచేసిన తర్వాత దాంట్లో మీరు చియా గింజలు వేసి కొద్దిసేపటి తర్వాత ఎంచక్కా తాగొచ్చు. .
మీకు ఇష్టమైన పండ్లతో స్మూతీలో కూడా చియా సీడ్స్ ను వేసి బాగా కలుపుకుని తినొచ్చు.