మనదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతో కలిసి ముంబయిలోని కుంబాల్లా హిల్ ప్రాంతంలోని అంటిలియాలో ఉంటారు.
ఆ ఇంటికి ఆ పేరు ఎలా వచ్చింది?
ముఖేష్ ఇంటికి అంటిలియా అనే పేరు పెట్టారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపం అంటిలియా నుంచి ఈ పేరు తీసుకున్నారు.
ఇంటి విస్తీర్ణం
అంటిలియా బహుళ అంతస్తుల భవనం. ఇది 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
ఇంటి ఖరీదు ఎంతంటే?
2006-2010 మధ్య కాలంలో దాదాపు 2 బిలియన్ డాలర్లు (16,702 కోట్ల రూపాయలు) ఖర్చుతో అంటిలియా నిర్మించారు. ప్రస్తుతం దీని విలువ 38,415 కోట్ల రూపాయలకు పైగా ఉంది.
ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు
బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత అంటిలియా ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసం కావడం విశేషం.
ఎన్ని అంతస్తులు అంటే..
అంటిలియాలో 27 అంతస్తులు ఉన్నాయి. దీని లోబీ చాలా ఎత్తుగా ఉండి, 570 అడుగుల ఎత్తున్న 40 అంతస్తుల భవనానికి సమానం.
ముత్యాల వాడకం
అంటిలియా నిర్మాణంలో తామరపువ్వు , సూర్యుని ఆకారాలను ఉపయోగించారు. దీని నిర్మాణంలో స్ఫటికం, పాలరాయి , ముత్యాలను ఉపయోగించారు.
భూకంపం భయం ఉండదు..
అంటిలియా అందంగా కనిపించడమే కాకుండా బలంగా కూడా ఉంది. ఇది రిక్టర్ స్కేలులో 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకుంటుంది.
ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్
అంటిలియాలో హెల్త్ స్పా, సెలూన్, బాల్ రూమ్, 3 ఈత కొలనులు, యోగా స్టూడియో, డ్యాన్స్ స్టూడియో, 50 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న థియేటర్ ఉన్నాయి
అంటిలియాలో 9 లిఫ్టులు
అంటిలియాలో 9 హై-స్పీడ్ లిఫ్టులు, 168 కార్లు పార్కింగ్ చేసుకోవడానికి 6 అంతస్తులు, 3 హెలిప్యాడ్‌లు ఉన్నాయి.