పేరుతో పాటు మంచి సంపాదన ఆర్జించే ఉద్యోగాల్లో పైలట్ ఒకటి. భారత దేశంలో కమర్షియల్ పైలట్ కావాలని చాలా మంది కల కంటారు. అయితే పైలట్ అయ్యేందుకు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు.
పైలట్ కావాలంటే మీరు కచ్చితంగా ఏదైన గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి 10+2 లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్ తో పాటు, గణితం సబ్జెక్ట్ లో ఉండాలి.
ఇక పైలట్ కావాలనుకునే వారు మెడికల్ గా ఫిట్ గా ఉండాలి. ఇందుకోసం వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. మీరు పైలట్ గా ఫిట్ అనుకుంటే క్లాస్ 2 మెడికల్ సర్టిఫికెట్ అందిస్తారు.
పైలట్ కావాలనుకునే వారు ఫ్లయింగ్ స్కూల్ లేదా ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీలో చేరాల్సి ఉంటుంది. వీటిలో ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రైవేట్ సంస్థలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ, రాజీవ్ గాంధీ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, ది బాంబే ఫ్లయింగ్ క్లబ్ వంటి ప్రముఖ ప్రభుత్వ ఫ్లైట్ ట్రైనింగ్స్ స్కూల్స్ ఉన్నాయి.
పైలట్ ట్రైనింగ్ లో భాగంగా గ్రౌండ్ ట్రైనింగ్ (థియరీ), ఫ్లైట్ ట్రైనింగ్ (ప్రాక్టికల్) రెండింటినీ అందిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో ఫీజు కాస్త ఎక్కువగా ఉంటుంది.
వివిధ పైలెట్ లైసెన్స్ ఇలా ఉంటాయి.
* స్టూడెంట్ పైలట్ లైసెన్స్ (SPL)
* ప్రైవేట్ పైలట్ లైసెన్స్ (PPL)
* కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL)
శిక్షణలో భాగంగా, కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL)కి అర్హత పొందాలంటే నిర్ధిష్టంగా కొన్ని గంటలు విమానాలను నడపాల్సి ఉంటుంది.
భారత దేశంలో ప్రైవేట్ సంస్థల్లో పైలట్ ట్రైనింగ్ ఖర్చుతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. శిక్షణా పాఠశాల, శిక్షణ అవసరాలను బట్టి శిక్షణ మొత్తం ఖర్చు రూ.80 లక్షల నుంచి కోటి వరకు ఉంటుంది.
అయితే ప్లయింగ్ ట్రైనింగ్ కోసం అయ్యే ఫీజు ఖర్చులు భరించడానికి కొన్ని సంస్థలు స్కాలర్‌షిప్‌లు అందిస్తాయి. స్టూడెంట్ లోన్ లోన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.