INTERNATIONAL
భారతదేశంలో మెజారిటీ హిందూ ప్రజలు పాకిస్తాన్‌లో మైనారిటీలు. కానీ ఇక్కడ మైనారిటీ ముస్లింలకు వున్నట్లు రక్షణ అక్కడ హిందువులకు లేదు. హిందువులపైనే కాదు దేవాలయాపైనా దాడులు జరుగుతాయి.
పాకిస్తాన్‌లో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, వాటి సంరక్షణ ఎవరు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాాం.
పాకిస్తాన్‌లో తరచూ మత ఛాందసవాదులు హిందూ దేవాలయాలను దాడులకు పాల్పడి ధ్వంసం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి చిత్రాలు, వీడియోలు చాలాసార్లు వైరల్ అవుతాయి.
స్వాతంత్య్రం తర్వాత అంటే భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో చాలా హిందూ దేవాలయాలు పాకిస్థాన్ భూభాగంలో వుండిపోయాయి. అక్కడి దేవాలయాలను పాక్ ప్రజలు కూల్చివేసారు. ఇప్పుడు వాటి జాడలే లేవు.
విభజన తర్వాత పాకిస్తాన్‌లో దేవాలయాలను కూల్చివేయడం, హిందూ సమాజంపై దాడులు నిరంతరం జరుగుతున్నాయి.
1947లో పాకిస్తాన్‌లో 428 దేవాలయాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. 1990ల నాటికి వీటిలో 408 దేవాలయాలను రెస్టారెంట్లు, హోటళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు లేదా మదర్సాలుగా మార్చారు.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో కేవలం 22 హిందూ దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో 11 దేవాలయాలు సింధ్ ప్రావిన్స్‌లో, పంజాబ్ 4, పఖ్తుంఖ్వా 4, బలూచిస్తాన్‌లలో 3 దేవాలయాలు ఉన్నాయి.
ఈ దేవాలయాల్లో స్థానిక హిందువులు పూజలు చేస్తారు, వారే వాటి సంరక్షణ కూడా చూసుకుంటారు.