INTERNATIONAL

ప్రపంచంలోనే అతి పెద్ద 10 వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

బోట్స్వానాలో దొరికిన వజ్రం

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రం ఇటీవల ఆఫ్రికాలోని బోట్స్వానాలో దొరికింది. కెనడా కంపెనీకి చెందిన గనిలో 2,492 క్యారెట్ల బరువున్న ఈ ముడి వజ్రం లభ్యమైంది.   

1- కల్లినన్ వజ్రం

3,106 క్యారెట్ల  కల్లినన్ వజ్రం ప్రపంచంలోనే  పెద్దది. 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. దీనిని తొమ్మిది  వజ్రాలుగా చెక్కారు. ఇవి చాలా వరకు బ్రిటిష్ క్రౌన్ జ్యువెలరీలో ఉన్నాయి.

2- బోట్స్వానాలో దొరికిన వజ్రం

బోట్స్వానాలో 2,492 క్యారెట్ల బరువున్న రెండో అతి పెద్ద వజ్రం దొరికింది. బోట్స్వానా రాజధాని గాబోరోన్‌కు దాదాపు 500 కి.మీ. దూరంలో ఉన్న కరోవే గనిలో ఇది లభ్యమైంది.

3. లూయిస్ విట్టన్ సెవెలో వజ్రం

1,758 క్యారెట్ల బరువున్న లూయిస్ విట్టన్ సెవెలో వజ్రం మూడో స్థానంలో ఉంది. దీనిని 2019లో బోట్స్వానాలోని కరోవే గనిలో కనుగొన్నారు.

4. కరోవే వజ్రం

బోట్స్వానాలోని కరోవేలో 2021లో 1,174.76 క్యారెట్ల బరువున్న వజ్రం లభ్యమైంది. దీనిని లూకారా అనే కంపెనీ గని నుండి తవ్వారు. 

5. లెసెడి లా రోనా

లెసెడి లా రోనా 1109 క్యారెట్ల బరువున్న వజ్రం. దీనిని నవంబర్ 2015లో బోట్స్వానాలోని కరోవే గనిలో కనుగొన్నారు. దీనిని కోయడానికి 18 నెలలు పట్టింది. 

6. జ్వానెంగ్ వజ్రం

జూన్ 2021లో బోట్స్వానాలోని జ్వానెంగ్ గని నుండి 1098 క్యారెట్ల బరువున్న వజ్రం లభ్యమైంది. ఈ గని దెబ్స్వానా-డి బీయర్స్ , బోట్స్వానా ప్రభుత్వాల మధ్య 50-50 భాగస్వామ్యంతో నడుస్తోంది.

7. 1080 క్యారెట్ల వజ్రం

2015లో లూకారా కంపెనీకి బోట్స్వానాలోని కరోవే గనిలో 1080 క్యారెట్ల బరువున్న వజ్రం దొరికింది. బోట్స్వానా ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల ఉత్పత్తి దేశాలలో ఒకటి. 

8. 998 క్యారెట్ల వజ్రం

నవంబర్ 2020లో కెనడియన్ కంపెనీ లూకారా డైమండ్ కార్ప్ బోట్స్వానాలోని కరోవే గనిలో 998 క్యారెట్ల బరువున్న వజ్రాన్ని బయటకు తీసింది.

9. ఎక్సెల్సియర్, 995 క్యారెట్లు

ఎక్సెల్సియర్ అనే వజ్రం 995.20 క్యారెట్ల బరువు ఉంది. దీనిని 1893లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. దీనిని 21 ముక్కలుగా కోశారు.

10. సియెర్రా లియోన్ స్టార్

1972లో సియెర్రా లియోన్‌లోని కోయిడు జిల్లాలో 968.90 క్యారెట్ల  సియెర్రా లియోన్ స్టార్ వజ్రం లభ్యమైంది. దీనిని హ్యారీ విన్‌స్టన్ 2.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.

పాస్ పోర్ట్, వీసా లేకుండానే నేపాల్ టూర్ : ఈ 8 అందాలతో కనువిందు ఖాయం