INTERNATIONAL

ప్రపంచంలోని టాప్-10 చిన్న దేశాలు

1. వాటికన్ సిటీ

వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. 0.49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దక్షిణ ఐరోపా దేశ జనాభా 497.

2. మొనాకో

దక్షిణ ఐరోపా దేశమైన మొనాకో విస్తీర్ణం 2 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 38,631 మంది నివసిస్తున్నారు.

3. నౌరు

నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం నౌరు. 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 11,947.

4. తువాలు

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 9 చిన్న ద్వీపాల సమూహమైన తువాలు విస్తీర్ణం 26 చదరపు కిలోమీటర్లు. ఈ దేశ జనాభా 9,646.

5. శాన్ మారినో

ఇటలీతో చుట్టుముట్టబడిన శాన్ మారినో విస్తీర్ణం 61 చదరపు కిలోమీటర్లు. ఇక్కడి జనాభా 33,581 మంది.

6. లిచెన్‌స్టెయిన్

160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లిచెన్‌స్టెయిన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉంది. ఇక్కడ 39,870 మంది నివసిస్తున్నారు.

7. మార్షల్ దీవులు

వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మార్షల్ దీవుల విస్తీర్ణం 181 చదరపు కిలోమీటర్లు. జనాభా 37,548 మంది.

8. సెయింట్ కిట్స్ నెవిస్

వెస్టిండీస్‌లో ఉన్న ద్వీప దేశం సెయింట్ కిట్స్ నెవిస్. 261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 46,843.

9. మాల్దీవులు

భారత ఉపఖండం నైరుతి దిశలో ఉన్న మాల్దీవులు దాదాపు 1,200 ద్వీపాలతో కూడిన దేశం. చాలా ద్వీపాలు నిర్జనమైనవి. దీని జనాభా 527,799 మంది.

10. మాల్టా

ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మధ్య, ఇటలీ ద్వీపం సిసిలీకి దక్షిణంగా ఉన్న మాల్టా విస్తీర్ణం 316 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 539,607 మంది నివాసముంటున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం డిపాజిట్ రూ. 7000 కోట్లు!!

ప్రపంచంలోనే అతి పెద్ద 10 వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

పాస్ పోర్ట్, వీసా లేకుండానే నేపాల్ టూర్ : ఈ 8 అందాలతో కనువిందు ఖాయం