INTERNATIONAL
ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశం ఏదో మీకు తెలుసా? ఇప్పటివరకు ఏకంగా ఏడు సార్లు సంతోషంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఫిన్లాండ్.
ఫిన్లాండ్ రాజకీయాలు, పని విధానం, విద్యా వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రపంచానికి ఆదర్శంగా వుంటాయి ఇవే ఆ దేశ ప్రజలను సంతోషంగా వుండేలా చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పని ఒత్తిడి, ఎక్కువ సమయం పనిచేయడం వల్ల ఉద్యోగుల ఇబ్బందులు పెరుగుతున్నాయి. కానీ ఫిన్లాండ్ పనివిధానం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. అందుకే ప్రజలు సంతోషంగా ఉంటారు.
ఫిన్లాండ్‌లో ప్రజలు పని, వ్యక్తిగత జీవితాల మధ్య బ్యాలెన్స్ ను పాటిస్తారు. తల్లిదండ్రులకు పిల్లలు, కుటుంబంతో సమయం గడపడానికి వారికి ప్రత్యేకంగా సెలవులు ఇస్తారు.
ఫిన్లాండ్‌లో ఉద్యోగులకు వ్యక్తిగత జీవితాన్ని గడిపేందుకు తగినన్ని సెలవులు లభిస్తాయి. తద్వారా వారు తమ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ అద్భుతం. కిండర్ గార్టెన్ నుండి పట్టభద్రుల వరకు చదువు ఉచితం. అలాగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు కూడా ఉచితం.
ఈ దేశంలో పురుషులు, స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు సమానంగా ఉంటాయి. లింగసమానత్వం కూడా ఈ దేశ ప్రజల సంతోషానికి కారణం.
ఫిన్లాండ్ ప్రజల జీవనశైలి చాలా సింపుల్ గా వుంటుంది. ఇదే వారి సంతోషానికి కారణం. వారి జీవన విధానం కూడా ప్రపంచానికి ఆదర్శం.