Health
ఏసీలో ఉంటే చెమట పట్టకపోవచ్చు, కానీ మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ , తలనొప్పి వస్తుంది.
ఏసీ గదుల్లోకి తాజా గాలి రాదు. దీంతో ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ క్రమంలో కార్బన్ డై ఆక్సైడ్ లెవల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల తలనొప్పి, అలసట వస్తుంది.
ఏసీ గదిని చల్లబరచడానికి గాలిలోని తేమను తొలగిస్తుంది. పొడి గాలి ముక్కు రంధ్రాలను ఇరిటేట్ చేసి తలనొప్పిని కలిగిస్తుంది.
ఏసీని క్రమంగా శుభ్రం చేయకపోతే చెడు గాలిని వదులుతుంది. దీనివల్ల దుమ్ము, బాక్టీరియా, అలెర్జీలు వ్యాపిస్తాయి.
పొడి చల్లని గాలి సైనస్ సమస్యకు దారితీస్తుంది. దీనివల్ల తలనొప్పి, కళ్ళు, నుదురు, బుగ్గల చుట్టూ నొప్పి వస్తుంది.
ఏసీ నుండి వచ్చే చల్లని గాలి నేరుగా మొహం, మెడ, తలపై పడితే రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. దీని వల్ల తలనొప్పి వస్తుంది.
ఏసీ గదిలో ఉండటం వల్ల రక్త ప్రసరణ, కండరాలు బిగుసుకుపోయి మెడ, తలలో కండరాల నొప్పి, తలనొప్పి వస్తుంది. అందుకే ప్రతి 5-6 నెలలకు ఒకసారి ఏసీని కచ్చితంగా సర్వీసింగ్ చేయాలి.