చెమట పట్టడం సహజ ప్రక్రియ. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెమట పడుతుంది.
కొంతమందికి స్నానం చేసిన తర్వాత కూడా చెమట పడుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
స్నానం చేసిన తర్వాత టవల్ తో తుడుచుకునేటప్పుడు శరీరంలో కొద్దిగా వేడి పుడుతుంది. దీనివల్ల శరీరంలోని చెమట గ్రంథులు చురుగ్గా పనిచేసి చెమట పడుతుంది.
సాధారణంగా స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లో వాతావరణం తేమగా, వేడిగా మారుతుంది. ఫలితంగా స్నానం చేసిన తర్వాత కూడా చెమట పడుతుంది.
వేడి నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల స్నానం చేసిన తర్వాత చెమట పడుతుంది.
వ్యాయామం తర్వాత వెంటనే స్నానం చేసినా.. స్నానం చేసిన తర్వాత చెమట పడుతుంది.