Health
మూర్చ వల్ల మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. మూర్చ మెదడు ప్రక్రియను దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూర్చకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో నిద్రలేమి ఒకటి. నిద్రలేమి, స్లీప్ అప్నియా వంటి సమస్యల వల్ల కూడా మూర్చ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
విపరీతమైన జ్వరం వల్ల కూడా మూర్చ వస్తుందని ఆరోగ్య నిపుణఉలు చెబుతున్నారు. ముఖ్యంగా జ్వరం వల్ల చిన్న పిల్లలకే ఎక్కువగా మూర్చ వస్తుంది.
మానసిక ఒత్తిడి కూడా మూర్చకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్ట్రెస్ వల్ల మెదడులో రసాయన మార్పులు జరిగి మూర్చ వచ్చే అవకాశం ఉంది.
చాలా ఏండ్లుగా మందును ఎక్కువగా తాగేవారికి మూర్చ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మాదక ద్రవ్యాలు వాడే వారికి కూడా ఈ రిస్క్ ఉంది.
బాడీ డీహైడ్రేషన్ అయితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యంగా మారతాయి. దీంతో మెదడు జీవక్రియల్లో మార్పు వచ్చి మూర్చ వస్తుంది.