Telugu

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలంటే.. డైట్ లో ఈ మార్పులు చేయాల్సిందే..

Telugu

జీర్ణవ్యవస్థపై ప్రభావం

రాత్రి ఆలస్యంగా నిద్రపోతే.. జీర్ణవ్యవస్థ క్షీణిస్తుంది. సరైన నిద్ర లేకపోతే జీర్ణవ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

Image credits: FREEPIK
Telugu

డైట్ లో మార్పులు

నానబెట్టిన బియ్యం వండి తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ బియ్యాన్ని నానబెట్టడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. 

Image credits: FREEPIK
Telugu

కివి పండ్లు

 కివి పండులో విటమిన్ సి, ఈ, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్ స్థాయిని పెంచుతాయి. సెరటోనిన్ మెరుగైన నిద్రకు సహాయం చేస్తుంది. 

Image credits: FREEPIK
Telugu

బాదం

బాదం శక్తివంతమైన పోషకాహారం. ఇందులో మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ స్థాయిని పెంచుతుంది.  

Image credits: Pinterest
Telugu

చపాతీ, కూర

సాదా చపాతీ, కాకరకాయ, దొండకాయ, బెండకాయ వంటివి తినవచ్చు.  ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. 

Image credits: Pinterest
Telugu

పెరుగు

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి. పెరుగును జీర్ణించుకోవడం సులభం, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Image credits: Social Media
Telugu

పాలు

రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. పసుపు లేదా మిరియాలు కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Social media
Telugu

ఏ ఆహారాలు మానేయాలి?

రాత్రిపూట నూనె ఎక్కువగా ఉన్న ఆహారం, ఊరగాయలు, ఫాస్ట్ ఫుడ్, కారం ఎక్కువగా ఉన్నవి తినకూడదు. ఇవి అజీర్తి, గ్యాస్, నిద్రలేమికి కారణమవుతాయి.

Image credits: Freepik

Mosquito: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు!

Egg yolk: గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Coconut: ఖాళీ కడుపుతో పచ్చికొబ్బరి తింటే.. ఇన్ని ప్రయోజనాలా?

Broccoli: బ్రోక‌లీ తింటే ఎన్ని లాభాలో.. జీర్ణక్రియ నుండి గుండె వరకు..