గుడ్డు లోపల ఉండే పసుపు భాగాన్ని పచ్చసొన అంటారు. ఇది గుడ్డులోని పోషకాలకు ప్రధాన వనరు. చాలామంది పచ్చసొన అంటే కేవలం కొవ్వు అనుకుంటారు.
Image credits: Freepik
Telugu
పచ్చసొనలో ఏం ఉంటాయి?
గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్, కొవ్వు, విటమిన్ A, B12, D, E, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి.
Image credits: Freepik
Telugu
పచ్చసొన వల్ల ప్రయోజనాలు
పచ్చసొన తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది, అలసటను తగ్గిస్తుంది, ఎముకలకు విటమిన్ D లభిస్తుంది.
Image credits: Freepik
Telugu
పచ్చసొనను ఎందుకు పాడేస్తున్నారు?
గుడ్డు పచ్చసొన తినడం మానుకోవడానికి ప్రధాన కారణం అందులో అధిక కొలెస్ట్రాల్ ఉండటం. కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
Image credits: Freepik
Telugu
పచ్చసొన తినకూడదా?
కాలేయం సమస్య ఉన్నవారు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి డాక్టర్ సలహా మేరకు పచ్చసొన ను తీసుకోవాలి.
Image credits: Freepik
Telugu
వారికి పచ్చసొన చాలా ముఖ్యం
గుడ్డులోని తెల్లసొనలో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉండగా, పచ్చసొనలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మొత్తం గుడ్డు తింటేనే అన్ని పోషకాలు పొందవచ్చు.