Mosquito: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు!
health-life Jun 07 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
మిరియాలు
ఒక చెంచా మిరియాల పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత కర్పూరం, తులసి నూనె కలిపి స్ప్రే చేస్తే దోమలు దరి చేరవు.
Image credits: Getty
Telugu
వెల్లుల్లి
వెల్లుల్లిని దోమలను తరిమికొట్టడానికి ఉపయోగించవచ్చు. దీనిలోని సల్ఫర్ కంటెంట్ దోమలను పారిపోయేలా చేస్తుంది. వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తే దోమల బెడదకు చెక్ పెట్టవచ్చు
Image credits: Getty
Telugu
పుదీనా, నిమ్మకాయ
పుదీనా, నిమ్మకాయ ముక్క వేసి బాగా మరిగించాలి. ఆ రసాన్ని స్ప్రే చేయడం వల్ల దోమలను తరిమికొట్టవచ్చు.
Image credits: Getty
Telugu
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క, నిమ్మకాయను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ రసాన్ని స్ప్రే చేస్తే దోమలు పరార్ అవుతాయి.
Image credits: Getty
Telugu
కర్పూరం
దోమలను తరిమికొట్టేందుకు కర్పూరం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఇంటి తలుపులు మూసి కర్పూరం వెలిగించాలి. కర్పూరం వాసనతో దోమలు సతమతపడుతాయి.
Image credits: Getty
Telugu
కాఫీ పొడి
దోమలు ఎక్కువగా వచ్చే చోట కాఫీ పొడిని కాల్చితే దాని వాసన, పొగ వల్ల దోమలు రావు.