అతి నీరసం, అలసట అనేక కారణాల వల్ల రావచ్చు. అయితే, అవి కేవలం ఒత్తిడి, నిద్రలేమి వల్లనే కాకుండా కిడ్నీ సమస్యల సంకేతంగా కూడా ఉండొచ్చు.
రాత్రిపూట తరచూ మూత్రవిసర్జనకు లేవడం సాధారణ సమస్యనే అనిపించినా, ఇది కొన్నిసార్లు కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు.
మూత్రం పరిమాణం పెరగడం లేదా తగ్గడం, రంగు మారడం వంటి లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు. ఇది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని వ్యర్థాలు, లవణాలు రక్తంలో పేరుకుపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారడం, దురద, ర్యాష్‌లు వంటి సమస్యలు ఏర్పడుతాయి.
కిడ్నీ పనితీరు మందగిస్తే శరీరంలో ద్రవాలు నిల్వవుతాయి. దీని వల్ల కాళ్లు, చేతులు, కళ్ళ కింద భాగం, ముఖం వంటి ప్రాంతాల్లో వాపు కనిపించవచ్చు. ఇది కిడ్నీ బలహీనత లక్షణం కావొచ్చు.
వీపు లేదా కడుపు పక్కల భాగాల్లో నొప్పి అనుభవించటం కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ లేదా వాపు ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో నొప్పి తలెత్తుతుంది.
పైన చెప్పిన లక్షణాలు ఉంటే స్వయంగా వైద్యం చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి. వైద్య పరీక్షల తర్వాతే సమస్య నిర్ధారణ చేయాలి.