ఆరోగ్యానికి వ్యాయామం చాలా మంచిది. కాబట్టి, సరైన ఆర్యోగం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయండి.
వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వాటిలో ఒకటి త్వరగా అలసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవిలో వ్యాయామం చేయడం కష్టం. త్వరగా అలసిపోతాం. అలా నీరసించిపోకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు మీ కోసం..
వ్యాయామానికి ముందు 2-3 గ్లాసుల నీరు త్రాగాలి. ఇది శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేస్తుంది.
వ్యాయామానికి ముందు బీన్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు తినండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువగా చెమట పడుతుంది. కాబట్టి, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవాలి.
కీరా, పుచ్చకాయ వంటి నీరున్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. ఇవి నీరసించకుండా ఉండటానికి సహాయపడతాయి.
వ్యాయామానికి ముందు ఏదైనా తినడం, త్రాగడం అలవాటు చేసుకోండి. అలాగే వ్యాయామం తర్వాత కూడా నీరు త్రాగాలి.
ఏసీలో తలనొప్పి వస్తుందా? ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్..
60 ఏళ్లలోనూ యంగ్ గా కనించాలా? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వేసవిలో మొటిమలు కనిపించకుండా పోవాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసం
Health Tips: వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తింటే.. ఆ సమస్యలు రావంట..!