Telugu

సడెన్ గా బరువు తగ్గారా? ఇదే కారణం కావచ్చు

Telugu

డయాబెటిస్

టైప్ 2 డయాబెటిస్.. శరీరంలో గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల వస్తుంది. దీని వల్ల  సడెన్ గా బరువు తగ్గే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

థైరాయిడ్

థైరాయిడ్ గ్రంథి అధికంగా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు జీవక్రియ వేగవంతం అవుతుంది. దీని ఫలితంగా బరువు తగ్గుతారు.

Image credits: Getty
Telugu

క్యాన్సర్

కడుపు, క్లోమం, ఊపిరితిత్తుల వంటి క్యాన్సర్‌ల  మొదటి లక్షణం బరువు తగ్గడం. క్యాన్సర్ కణాలు ఎక్కువ శక్తిని ఉపయోగించడం వల్ల, శరీరం వ్యాధితో పోరాడటం వల్ల ఇది జరుగుతుంది.

Image credits: Getty
Telugu

మానసిక ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన వంటివి జీర్ణక్రియ, ఆకలి శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.

Image credits: Freepik
Telugu

పేగు వ్యాధి

ఈ వ్యాధి వల్ల శరీరంలో పోషకాలు గ్రహించే సామర్థ్యం దెబ్బతింటుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. విరేచనాలు, కడుపు నొప్పి, వాపు, పోషకాహార లోపం వంటివి కూడా వస్తాయి.

Image credits: Getty
Telugu

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

ఆహారం, వ్యాయామం వంటి ఎలాంటి మార్పులు చేయకుండానే బరువు తగ్గితే, ముఖ్యంగా అలసట, జీర్ణ సమస్య, మానసిక స్థితి మార్పు వంటి వాటి వల్ల ఇది జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Image credits: Getty

Soaked Almonds: రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?

Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!

Guava Leaf Water: జామ ఆకుల నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Health Tips: వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి!