Health
నీళ్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. ఇవి మన బాడీని హైడ్రేట్ గా ఉంచి మనల్ని హెల్తీగా ఉంచుతాయి. కానీ నీళ్లను సరిగ్గా తాగకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగితే..
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిలబడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. ఇలా నీళ్లు తాగడం వల్ల కడుపులో ద్రవాల సమతుల్యత దెబ్బతింటుందట.
మనం కూర్చొని నీళ్లు తాగితే మన శరీరంలో పోషకాలను బాగా గ్రహిస్తుంది. అదే నిలబడి నీళ్లుతాగితే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిలబడి నీళ్లు తాగితే శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. అలాగే ఊపిరి సరిగ్గా ఆడదు.
మీకు తెలుసా? కూర్చొని నీళ్లు తాగితే మన కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి పడదు. దీంతో వ్యర్థాలు ఈజీగా బయటకు పోతాయి. అదే నిలబడి నీళ్లు తాగితే దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల సమస్యలు, ఎముకల సమస్యలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే దీనివల్ల కీళ్లలో ద్రవం పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది.