పచ్చి క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీర బరువు తగ్గించడానికి ఇది తినడం మంచిది.
ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, కె, ఎ, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్, మెగ్నీషియం వంటివి పర్పుల్ క్యాబేజీలో ఉంటాయి.
పోషకాలు నిండిన పర్పుల్ క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను తగ్గిస్తుంది.
పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ సి, కె, కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
కళ్ళ ఆరోగ్యానికి పర్పుల్ క్యాబేజీ చాలా మంచిది. కంటి చూపు మెరుగుపరచడమే కాకుండా, కంటిశుక్లం రాకుండా కూడా ఇది సహాయపడుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.