Iron Rich Foods: ఐరన్ పుష్కలంగా లభించే టాప్ 10 సూపర్ ఫుడ్స్
Telugu
రెడ్ మీట్
రెడ్ మీట్ లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాముల ఎర్ర మాంసంలో దాదాపు 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.
Telugu
పాలకూర
పాలకూరలో ఐరన్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 2.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.
Telugu
సముద్రపు చేప
సముద్రపు చేపలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఐరన్ లభిస్తుంది.
Telugu
బెల్లం
బెల్లంలో ఐరన్, ఫోలేట్ రెండూ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను నివారించడానికి బెల్లం తీసుకోవడం బెటర్.
Telugu
డ్రై ఫ్రూట్స్
ఖర్జూరం, ఎండుద్రాక్ష, అంజీర్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
Telugu
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. గుమ్మడి గింజలను స్మూతీస్ వంటి వాటిలో యాడ్ చేసుకోవచ్చు. గుమ్మడి గింజలను చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
Telugu
7. నువ్వులు
నువ్వుల్లో కాల్షియంతో పాటు ఐరన్ సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల నల్ల నువ్వుల్లో 13.90 ఐరన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి రోజుకు గుప్పెడు నువ్వుల గింజలు తింటే మంచిది
Telugu
8. మెంతులు
మెంతులు చాలా శక్తివంతమైన ఆహారం. మెంతులను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఐరన్ లభిస్తుంది.
Telugu
9. పప్పు ధాన్యాలు
పప్పు ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఐరన్ లభించడమే కాకుండా, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, అమైనో ఆమ్లాల వంటి ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.
Telugu
10. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో ఐరన్ సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల డార్క్ చాక్లెట్ లో 11.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.