Health
ఆరెంజ్ జ్యూస్ రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరెంజ్ జ్యూస్‌లో చాలా పోషకాలు ఉన్నాయి.
ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని చాలా వ్యాధుల నుంచి కాపాడుతాయి.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆరెంజ్ జ్యూస్ తాగండి. ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ తాగితే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి.
కొలెస్ట్రాల్ సమస్య పెరిగితే ఆరెంజ్ జ్యూస్ తాగాలి. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. నీరసం, అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వెంటనే శక్తి వస్తుంది. వ్యాధులు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది.
ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి ఆరెంజ్ జ్యూస్ చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.