Health
షుగర్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడే ఆహారాల్లో కరివేపాకు ఒకటి.
కరివేపాకులో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి.
మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కరివేపాకు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కరివేపాకు సహాయపడుతుంది.
షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గవచ్చు.