Telugu

Skin Care: వర్షాకాలంలో మీ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Telugu

చర్మ సంరక్షణ అవసరం

వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల ముఖంపై నూనె, దుమ్ము, చెమట చేరుతుంది. దీని వల్ల చర్మ రంధ్రాలు మూసుకుని మురికి చేరి మొటిమలు ఏర్పడుతాయి. 

Image credits: pinterest
Telugu

సహజ పరిష్కారం

వర్షాకాలంలో చర్మ సమస్యలు ఎక్కువే. టోనర్ వాడటం వల్ల రంధ్రాలు మూసుకుపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ ఆయిల్ లేదా గులాబీనీరు వంటి సహజ టోనర్‌లు చర్మానికి మేలు చేస్తాయి.

Image credits: pinterest
Telugu

స్క్రబ్బింగ్ తప్పనిసరి

వర్షాకాలంలో చర్మంపై చనిపోయిన కణాలు చేరే అవకాశముంది. స్క్రబ్ చేయడం ద్వారా అవి తొలగి, చర్మం కాంతివంతంగా మారుతుంది. శనగపిండి, తేనె, పంచదారతో ఇంట్లోనే సహజ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

మాయిశ్చరైజర్ తప్పనిసరి

వాతావరణం తేమగా ఉన్నా, చర్మంలోని తేమను కాపాడుకోవడం అవసరం. ఇందుకోసం తేలికైన, నీటి ఆధారిత మాయిశ్చరైజర్ వాడితే చర్మం పొడిబారకుండా మృదువుగా మారుతుంది.  

Image credits: pinterest
Telugu

సన్‌స్క్రీన్ వాడండి

వర్షాకాలంలో ఎండ లేకపోయినా, హానికరమైన UVA/UVB కిరణాలు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని బయటకు వెళ్లే ముందు అప్లై చేయడం ద్వారా చర్మాన్ని రక్షించుకోవచ్చు

Image credits: pinterest
Telugu

సరైన జీవనశైలి

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. కేవలం బాహ్య చికిత్సలు సరిపోవు. రోజూ ఎక్కువగా నీళ్లు తాగడం, అధికంగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image credits: pinterest

Black Coffee: బ్లాక్ కాఫీతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్

రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు!

యోగా చేసిన వెంటనే వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

స్నానం చేసిన తర్వాత చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే!