శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ప్రోటీన్. కండరాలు, హార్మోన్ ఉత్పత్తి, జుట్టు, చర్మ ఆరోగ్యానికి ప్రోటీన్ అవసరం.
శరీరంలో అధిక ప్రోటీన్ కూడా సమస్యే. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు.
అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరుకు ఆటంకం కలిగి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.
అధిక ప్రోటీన్ ఎముకలను బలహీనపరిచి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
అధిక ప్రోటీన్ తీసుకోవడం బరువు పెరగడానికి కారణమవుతుంది. అదనపు ప్రోటీన్ కొవ్వుగా నిల్వ అవుతుంది. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది.
అధిక ప్రోటీన్ మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
ప్రోటీన్ వనరుల్లో తరచుగా సంతృప్తి కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. అధిక ప్రోటీన్ తీసుకోవడం గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.
కొన్ని రకాల ప్రోటీన్లు, ముఖ్యంగా రెడ్ మీట్ , ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Health Tips: క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..
Knee pains: నిలబడి నీరు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయా? నిజమెంత
HDL cholesterol: మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే.. ఈ మార్పులు చేయండి!
విటమిన్ డి కోసం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసా?