రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే స్థితిని హైపర్ యూరిసెమియా అంటారు. దీని లక్షణాలు ఇక్కడ చూడండి.
అధిక యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ల నొప్పులు, ముఖ్యంగా బొటనవేలులో నొప్పి, వాపు, ఎరుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిద్రపోయినా అలసటగా ఉంటే అది అధిక యూరిక్ యాసిడ్ లక్షణం కావచ్చు.
ఆరోగ్యకరమైన వ్యక్తి మూత్రం సాధారణంగా లేత పసుపు రంగులో ఉంటుంది,. కానీ, యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే మూత్రం ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారవచ్చు.
నొప్పి లేని గడ్డలు కూడా అధిక యూరిక్ యాసిడ్ లక్షణం కావచ్చు. ఈ గడ్డలు సాధారణంగా కీళ్లలో, ముఖ్యంగా బొటనవేలు, చీలమండలు, మోచేతులు, మోకాళ్లు, పాదాల కీళ్లలో ఏర్పడతాయి.
యూరిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. నొప్పి, వాంతులు, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి.