రాత్రి భోజనం త్వరగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకో ఇక్కడ చూద్దాం.
రాత్రి భోజనం ఏడు గంటలకు చేయడం చాలా మంచిది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది.
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది బరువుతో పాటు రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి దారితీస్తుంది.
రాత్రి భోజనానికి తేలికపాటి ఆహారాలు తీసుకోవాలి. అవి సులభంగా జీర్ణమవుతాయి.
రాత్రి 10 గంటలకు భోజనం చేసేవారికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
త్వరగా భోజనం చేయడం వల్ల గుండెపోటు ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.