Health
కరోనా తర్వాత చైనా నుంచి మరో కొత్త వైరస్ ఇండియాలో అడుగుపెట్టింది. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు పిల్లలకు సోకింది. అదే హ్యూమన్ మెటాన్యూమో వైరస్( HMPV)
HMPV వైరస్ చిన్న పిల్లలను, ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
HMPV వైరస్ లక్షణాలు ఫ్లూ లాంటివి. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా 3 నుంచి 5 రోజుల వరకు శరీరంలో ఉంటుంది.
రద్దీ ప్రదేశాలకు చిన్న పిల్లలను తీసుకెళ్లకండి. జలుబు ఉంటే ప్రత్యేక తువ్వాలు, బట్టలు వాడండి. మాస్క్ ధరించండి.
పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోండి. ఆ తర్వాత శానిటైజ్ చేసుకోండి.
ప్రత్యేకమైన మందు లేదు. సాధారణ ఫ్లూ మందులే ఇస్తారు. వ్యాక్సిన్ కూడా లేదు.
భయపడాల్సిన అవసరం లేదు. శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు ప్రమాదకరం. ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
కొబ్బరి నీళ్లు కాదు.. కొబ్బరి పాలను తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే..
ఈ లక్షణాలున్నాయా.. థైరాయిడ్ సమస్య ఉన్నట్లే
ఈ చిట్కాలు పాటిస్తే చలికాలంలో గుండెపోటు రాదు