HDL cholesterol: మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే.. ఈ మార్పులు చేయండి!
Telugu
హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్
రక్తంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యానికి మంచిది. HDL కొలెస్ట్రాల్ ధమనుల నుండి చెడు కొలెస్ట్రాల్ (LDL) ని తొలగించి కాలేయానికి తీసుకువెళుతుంది.
Telugu
ఆలివ్ నూనె
ఆహారంలో ఆలివ్ నూనె చేర్చుకోండి. ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె, చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు సహాయపడతాయి.
Telugu
వ్యాయామం
వారానికి కనీసం 150 నిమిషాలు వేగంగా నడవడం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయండి.
Telugu
తక్కువ కార్బోహైడ్రేట్స్
తక్కువ కార్బోహైడ్రేట్స్ గల ఆహారం తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరగవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ తగ్గవచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Telugu
కొబ్బరి నూనె
ఆహారంలో కొబ్బరి నూనె చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, జీవక్రియ రేటు పెరుగుతుంది, హెచ్‌డిఎల్ పెరుగుతుంది.
Telugu
ధూమపానానికి దూరం
ధూమపానం మానేయడం వల్ల రక్తంలో నుండి కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
Telugu
బరువు తగ్గించుకోండి
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గితే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
Telugu
సాల్మన్ చేప
కొవ్వు చేపల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మంచివి. మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి కూడా సహాయపడతాయి.