వేసవిలో బయటకు వెళ్ళేటప్పుడు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీరు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వడదెబ్బ నుండి రక్షణ పొందవచ్చు.
Telugu
ఉల్లిపాయ రసం
మీరు వడదెబ్బ నుండి రక్షణ పొందడానికి ఉల్లిపాయ రసాన్ని చెవుల వెనుక, పాదాలు, ఛాతీపై రాసుకోండి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
Telugu
ఆపిల్ సైడర్ వెనిగర్
ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కొన్ని చుక్కల తేనె, నీటిని కలపండి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని సరిచేస్తుంది. వేసవిలో శరీరానికి శక్తినిస్తుంది.
Telugu
మజ్జిగ
మజ్జిగలో ఖనిజాలతో పాటు విటమిన్లు, ప్రోబయోటిక్స్ ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక సీసాలో మజ్జిగను తప్పకుండా ఉంచుకోవాలి.
Telugu
కాటన్ జాకెట్
మీరు వడదెబ్బ నుండి రక్షణ పొందడానికి కాటన్ జాకెట్ ధరించి, చెవులను బాగా కప్పుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది.
Telugu
సన్ గ్లాసెస్
ఎండలో ఎప్పుడూ కళ్ళు తెరిచి వదిలేయద్దు. తరచూ రెప్పలు వేయాలి. వడదెబ్బ తగిలితే కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సన్ గ్లాసెస్ వాడండి.