మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
గుండె జబ్బుల ముఖ్య లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఏదైనా పని చేస్తున్నప్పుడు ఛాతిలో అసౌకర్యం లేదా నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
శారీరక శ్రమ చేసేటప్పుడు లేదా విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా శ్వాస ఆడకపోతే అది గుండె జబ్బు లక్షణం కావచ్చు.
మెడ, దవడ, గొంతు, కడుపు లేదా వీపులో నొప్పి కూడా గుండె జబ్బు లక్షణాలు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి.
చేతుల్లో అసాధారణ నొప్పి, అసౌకర్యం లేదా మొద్దుబారడం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లైంగిక సామర్థ్యం తగ్గిందా.? క్యాన్సర్ కావొచ్చు
శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏమౌతుంది?
బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యంతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్!
Osteoporosis: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీలో ఆ లోపం ఉన్నట్లే..