పనికిరావనుకోకండి.. జామ ఆకుల్తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
health-life Jan 25 2025
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
జామఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం.
Image credits: Getty
Telugu
రక్తంలో చక్కెర స్థాయి పెరగదు
డయాబెటీస్ పేషెంట్లకు జామ ఆకులు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే కార్బోహైడ్రేట్లు బ్లడ్ షుగర్ ను పెంచవు. అలాగే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యానికి మంచివి
జామాకులు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
పేగుల ఆరోగ్యం
జామ ఆకుల్లో ఉండే లక్షణాలు పేగుల్లో హానికరమైన బ్యాక్టీరియా లేకుండా చేస్తాయి. అలాగే పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
నోటి ఆరోగ్యం
జామఆకులను తీసుకుంటే నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు పంటి, చిగుళ్ల నొప్పిని తగ్గిస్తాయి. అలాగే నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి.
Image credits: Getty
Telugu
క్యాన్సర్ నిరోధకం
జా ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్‌తో పోరాడుతాయి. ఇవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Image credits: AP
Telugu
జామ ఆకుల్ని ఎలా తినాలి?
ఒక గ్లాసు నీళ్లను తీసుకుని రెండుమూడు జామ ఆకులు వేసి బాగా మరిగించండి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.