Mosquitoes: ఇంట్లో దోమలు చంపేస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే పరార్!
health-life Jun 23 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఇంగువ గడ్డి
ఇంగువ గడ్డి సహజ దోమల నివారిణిగా పని చేస్తుంది. దోమలకు దీని వాసన నచ్చదు. కనుక ఈ మొక్కలను ఇంటి చుట్టూ పెంచుకోవడం వలన మీరు దోమల బెడద నుండి సులభంగా బయటపడవచ్చు.
Image credits: Getty
Telugu
లావెండర్
లావెండర్ మొక్క సువాసన కూడా దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. ఈ మొక్కను ఇంట్లో, బాల్కనీలో లేదా కిటికీ దగ్గర పెట్టుకుంటే చాలు దోమలు మీ ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు.
Image credits: Getty
Telugu
రోజ్మేరీ
రోజ్మేరీ రుచికి మాత్రమే కాదు, దోమలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. వీటి ఘాటు వాసనకు దోమలు పరార్ అవుతాయి.
Image credits: Getty
Telugu
తులసి మొక్క
తులసి ఔషధ మొక్కనే కాదు. కీటకాలు, దోమలను తరిమికొట్టడానికి సహజ నివారిణిగా పని చేస్తుంది. ఇంటి ముందు ఒక్క తులసి మొక్క నాటుకుంటే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
పుదీనా
పుదీనా ఆహారంతో పాటు దోమలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. పుదీనా వాసన దోమలకు నచ్చదు.
Image credits: Getty
Telugu
చామంతి
చామంతి కూడా దోమల బెడదను కూడా నియంత్రిస్తుంది. చామంతి పువ్వుల వాసనను ఇష్టపడవు . అందువల్ల ఈ మొక్కలను మీ ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలను సులభంగా వదిలించుకోవచ్చు.
Image credits: Getty
Telugu
యూకలిప్టస్
యూకలిప్టస్ వాసన దోమలకు నచ్చదు. కాబట్టి ఇంట్లో యూకలిప్టస్ మొక్కను నాటడం మంచిది.