Telugu

Acid Reflux : తరచూ గొంతులో త్రేన్పులు , ఛాతి మంట? ఈ చిన్న చిట్కాలతో..

Telugu

క్రమం తప్పకుండా

క్రమం తప్పకుండా భోజనం చేయడం అనేది యాసిడ్ రిఫ్లక్స్ నివారించడానికి మొదటి మార్గం. అలాగే పడక మీదకు చేరడానికి కనీసం 3 గంటల ముందే రాత్రి భోజనం పూర్తి చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. 

Image credits: Getty
Telugu

తక్కువ పరిమాణంలో

ఒకేసారి ఎక్కువ భోజనం చేయకుండా, తరచుగా తక్కువ పరిమాణంలో భోజనం చేయడం యాసిడ్ రిఫ్లక్స్ నివారించడానికి మరో మార్గం .

Image credits: Getty
Telugu

పుష్కలంగా

పుష్కలంగా నీరు త్రాగాలి. జీర్ణక్రియను సులభతరం చేయడానికి, ఆమ్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను నియంత్రించడానికి నీరు త్రాగడం మంచిది.

Image credits: Getty
Telugu

వీటికి దూరంగా

నూనెలో వేయించిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వు , కారం అధికంగా ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి.   

Image credits: Asianet News
Telugu

ఆ పండ్లు తినకండి

నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఎందుకంటే, ఇవి కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

హెల్థీ ఫుడ్

బాదం, జీడిపప్పు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. 

Image credits: Getty
Telugu

కెఫిన్

కొంతమందికి కెఫిన్ యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం కావచ్చు, కాబట్టి దానిని ఆహారం నుండి తొలగించడం మంచిది. కెఫిన్ కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది  

Image credits: Getty

Mosquitoes: ఇంట్లో దోమలు చంపేస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే పరార్!

Health Tips: జిమ్‌కి వెళ్లట్లేదా? ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలు చేయండి

Health Tips: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌ తప్పనిసరి !

Milk : రోజూ రాత్రి పాలు తాగితే.. శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా?