రోజూ వ్యాయామం చేస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల రక్తనాళాలు శుభ్రపడి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడానికి నడక చాలా మంచిది. రోజూ అరగంట వేగంగా నడిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
రోజూ జాగింగ్ చేస్తే గుండె కొట్టుకునే వేగం సరిగ్గా ఉంటుంది. బరువు కంట్రోల్‌లో ఉంటుంది. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
సైక్లింగ్ కాళ్ళకి, గుండెకి చాలా మంచిది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని కంట్రోల్ చేసి, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
రోజూ కొన్ని నిమిషాలు మెట్లు ఎక్కితే గుండెకి మంచిది. శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. యోగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ని ప్రభావితం చేస్తుంది.