వాడిన నూనెని మళ్లీ వాడకూడదా? తిరిగి ఉపయోగించాలంటే ఈ టిప్స్ పాటించండి!
health-life Jun 07 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
వడకట్టండి
నూనెను బాగా వడకట్టడానికి ముందుగా నూనె చల్లారనివ్వండి. ఆ తర్వాత కాఫీ వడపోతను గరాటులో ఉంచి నూనెను వడకట్టండి. ఈ పద్ధతిలో నూనెలోని చిన్న కణాలు తొలగిపోతాయి.
Image credits: Getty
Telugu
ఇలా నిల్వ చేయండి
నూనెను తాజాగా, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి చల్లని, చీకటి ప్రదేశంలో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. సరిగా నిల్వ చేయకపోతే.. నూనె త్వరగా పాడైపోవచ్చు.
Image credits: Getty
Telugu
బంగాళాదుంప
వాడిన నూనెలో ఆలుగడ్డ ముక్కలు తరిగి వేయాలి. తరవాత నూనెని బాగా వేడి చేస్తే.. ఆలుగడ్డ ముక్కలు నూనెలో ఉన్న నల్లని పదార్థాన్ని పూర్తిగా గ్రహిస్తుంది. ఇలా నూనె క్లీన్ అవుతుంది.
Image credits: Getty
Telugu
కార్న్ స్టార్చ్
ఒక టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ ను నూనెలో వేసి, బాగా కలియబెట్టి వడకట్టండి. ఇలా చేయడం వల్ల నూనెలోని మలినాలు తొలగిపోతాయి.
Image credits: Getty
Telugu
చల్లార్చండి
నూనెను శుభ్రపరిచే ముందు బాగా చల్లారనివ్వండి. వేడి నూనెతో చేతులు కాలే ప్రమాదం ఉంది.
Image credits: Getty
Telugu
నూనెలు కలపకండి
వివిధ రకాల వాడిన నూనెలను కలపకండి. ప్రతి నూనెకు వేరే రుచి ఉంటుంది.
Image credits: Getty
Telugu
అతిగా వాడకండి
ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగిస్తే.. పాయిజన్‌గా మారుతుంది. ఆ ఆహారాన్ని తినడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాడిన నూనెను తిరిగి వాడకపోవడం మంచిది.