త్వరగా సిద్దం కావడానికి చాలా మంది ఫౌండేషన్, లిప్‌స్టిక్ వంటి బ్యూటీ ప్రొడక్ట్స్ బాత్రూంలో పెడుతుంటారు. కానీ, ఇలాంటి వస్తువులను బాత్రూంలోనే ఉంచకూడదు.
ఎలక్ట్రానిక్ పరికరాలను బాత్రూంలో ఉంచడం వల్ల తేమ తగిలి త్వరగా తుప్పు పట్టే అవకాశం ఎక్కువ.
బాత్రూంలోని బూజు, క్రిములు తేలికగా పేరుకుపోతాయి. అలా క్రిములు పేరుకుపోయిన టాయిలెట్ పేపర్ ను ఉపయోగిస్తే అనారోగ్యం బారినపడే అవకాశముంది.
సరైన గాలి ప్రసరణ లేకపోవడం, తేమ ఎక్కువగా ఉండటం వల్ల నగలు త్వరగా మసకబారతాయి.
బాత్రూంలో ఉంచే మేకప్ ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగిస్తే మీకు చాలా చర్మ సమస్యలు వస్తాయి.
అవసరమైన వస్తువులు మాత్రమే బాత్రూంలో ఉంచాలి. ఇతర వస్తువులు బాత్రూంలో ఉంచితే పాడైపోవడానికి, అనేక సమస్యలు రావడానికి కారణమవుతుంది.