కుక్క కరిస్తే వెంటనే ఓ 15 నిమిషాల పాటు గాయంపై నీళ్ళు పోయాలి. సబ్బుతో కడిగి శుభ్రం చేయాలి.
కుక్క కరిస్తే గాయానికి కట్టు కట్టకూడదు. గాయం ఓపెన్ గానే ఉంచి హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. బ్లీడింగ్ ఎక్కువైతే శుభ్రమైన వస్త్రంతో కట్టు కట్టవచ్చు.
రేబిస్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క నాకినా, తాకినా ఏమీ కాదు. కాని వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతైనా మంచిదే.
కుక్క గీరినా, రక్తం కారకుండా కరిచినా డాక్టర్ ని సంప్రదించాలి.
ముఖం, చేతులు, మెడ మీద కరిస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. ముఖం మీద కరిస్తే వైరస్ త్వరగా మెదడుకి చేరుతుంది.
పిచ్చి కుక్క కరిస్తే రేబిస్ ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ తీసుకోవాలి. అన్ని డోసులు తప్పకుండా వేయించుకోవాలి.
పిల్లలకు వ్యాక్సిన్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, గాయం మానకపోవడం, ఇతర ఇబ్బందులుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.