Food
ప్రేమానంద్ మహారాజ్ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఎలాంటి ఆహారం తినకుండా ఉండాలో చెబుతున్నారు.
ప్రేమానంద్ మహారాజ్ ప్రకారం, ‘వేడి వేడిగా పొగలు కక్కుతున్న ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే అలాంటి ఆహారాన్ని తమోగుణంగా చెబుతారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి.’
‘ఆహారం సిద్ధమైన తర్వాత, ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టండి. కాసేపటి తర్వాత దాన్ని ప్రసాదంగా భావించి తినండి. ఇలా చేయడం వల్ల దేవతల దయ కూడా మీపై ఉంటుంది.’
‘ఎక్కువ నూనె, నెయ్యి ఉండే బరువు ఆహారం తినకుండా ఉండాలి. ఉదాహరణకు సమోసా, పూరి, బజ్జీలు, గులాబ్ జామ్ మొదలైనవి. ఈ ఆహార పదార్థాలను కూడా వీలైనంత తక్కువగా తినాలి.’
‘ఎక్కువ కారం, పులుపు, తీపి లేదా ఉత్తేజపరిచే ఆహారం తినకుండా ఉండాలి. ఇలాంటి ఆహారం తినడం వల్ల మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చి తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.’
ప్రేమానంద్ మహారాజ్ ప్రకారం ‘వీలైతే కడుపు నిండా తినకండి. ఒకటి రెండు రోటీల ఆకలి ఉండేలా చూసుకోండి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి.’