Food

శక్తిని పెంచే ఆహారాలు

మీరు శక్తివంతంగా ఉండాలంటే మీ డైట్ లో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటంటే? 
 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే కూడా మీకు తక్షణ ఎనర్జీ వస్తుంది. ఈ చాక్లెట్స్ మీ స్టామినాను పెంచుతాయి.
 

Image credits: Getty

గింజలు, విత్తనాలు

గింజలు, విత్తనాల్లో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీ అలసట దూరమవుతుంది. స్టామినా కూడా పెరుగుతుంది. 
 

Image credits: Getty

అరటిపండు

అరటిపండ్లను తింటే తక్షణమే ఎనర్జీ వస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే మీ శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. 
 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. 
 

Image credits: Getty

బెర్రీలు

బెర్రీలు కూడా మీ అలసటను దూరం చేస్తాయి. ఇందుకోసం మీరు బ్లూబెర్రీలను, స్ట్రాబెర్రీలను, బ్లాక్ బెర్రీలను రోజూ తినండి. 
 

Image credits: Getty

గుడ్డు

గుడ్లు ప్రోటీన్ల భాండాగారం. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల మీరు రీఫ్రెష్ గా ఉంటారు. ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు. 

Image credits: Getty

చిలగడ దుంప

చిలగడదుంపలను తినడం వల్ల కూడా మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇవి మీ అలసటను పోగొడుతాయి. 

Image credits: Getty

కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీరు చేయాల్సిందే ఇదే.. !

థైరాయిడ్ ఉన్నవాళ్లు ఇవి తినొద్దు

రంజాన్ మాసంలో ఖర్జూరాలను రోజూ తినొచ్చా?

ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యం గురించి భయం అక్కర్లే..