Food
అవును మాంసాహారం తినని వారు ఖచ్చితంగా పనీర్ ను తినాలి. ఎందుకంటే దీనిద్వారా మీ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్లు అందుతాయి. 100 గ్రాముల పన్నీర్ లో 18-20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీరు కందిపప్పు, పెసరపప్పు, శెనగప్పు వంటి పప్పులను తింటే మీరు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ప్రోటీన్లు అందుతాయి.
పచ్చి శెనగలను కూడా నాన్ వెజ్ తినని వారు ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. 100 గ్రాముల గ్రీన్ పీస్ లో 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
పల్లీలే కదా అనుకుంటే పొరపాటే. ఇవి కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 100 గ్రాముల పల్లీల్లో 25 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది.
నాన్ వెజ్ తినని వారు ఖచ్చితంగా బాదం పప్పులను నానబెట్టుకుని తినాలి. 100 గ్రాముల బాదం పప్పుల్లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి బాదం పప్పులను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి విత్తనాలు కూడా ప్రోటీన్లకు మంచి వనరులు. వీటిని తిన్నా మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.