Food

శరీరంలో రక్తం పెరగాలంటే ఏం తినాలి

Image credits: Getty

ఐరన్

మన శరీరానికి ఐరన్ చాలా ముఖ్యమైన పోషకం. అయితే ఇది ఒంట్లో తగ్గినప్పుడు ఎనర్జీ తగ్గుతుంది. అలాగే తలనొప్పి, మైకం, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

రక్తహీనత

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది. అవేంటంటే? 

Image credits: Getty

బెల్లం

 బెల్లం రక్తాన్ని పెంచడంలో చాాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే మీరు బెల్లానికి బదులుగా చక్కెరను తినండి. బెల్లం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: stockphoto

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఇనుము మెండుగా ఉంటాయి. వీటిని తిన్నా రక్త హీనత సమస్య తగ్గుతుంది. 

Image credits: Getty

ఎర్ర తోటకూర

ఎర్ర తోటకూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కూరను వారానికి రెండు సార్లు తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. 

Image credits: Getty

పప్పు ధాన్యాలు

పప్పు ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని తింటే శరీరంలో రక్తం పెరగడమే కాదు.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. 
 

Image credits: Getty

ఎండిన ఆప్రికాట్

డ్రై ఆప్రికాట్ లో ఫైబర్, ఇనుము, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్నా శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని పెంచడమే కాకుండా.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

సోయాబీన్

సోయాబీన్ లో ప్రోటీన్లు, ఐరన్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తిన్నా మీ శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. 

Image credits: Getty

ఉదయం పరిగడుపున వీటిని అస్సలు తినకూడదు తెలుసా

రాత్రిపూట అస్సలు ముట్టుకోకూడని ఫుడ్స్

ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మెడిసిన్ లాంటివి తెలుసా

అన్నానికి బదులు ఏం తినాలో తెలుసా