Coriander: కొత్తమీర ఇలా పెడితే నెలరోజులైనా తాజాగా ఉంటుంది
food-life Jun 17 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
కొత్తిమీర పాడైపోతుందా?
ఫ్రిజ్ లో జాగ్రత్తగా నిల్వ చేసినా కూడా కొత్తమీర తొందరగా పాడైపోతుందా? అయితే, మీరు దానిని సరిగా స్టోర్ చేయట్లేదని అర్థం. సరైన పద్దతిలో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది.
Image credits: pixabay
Telugu
తేమ, మంచుకు దూరంగా పెట్టండి
ఫ్రిజ్‌లో ఎక్కువ తేమ ఉండే చోట కొత్తిమీర పెట్టొద్దు. ముఖ్యంగా, మంచు ఎక్కువగా పేరుకునే ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. లేదంటే ఆకులు నీరెక్కి, త్వరగా కుళ్లిపోవడం మొదలవుతుంది.
Image credits: Getty
Telugu
మరి సరైన చోటు ఏది?
గాలి ఆడే బాక్సులు లేదా షెల్ఫులు వాడండి. కొత్తిమీరను ఎప్పుడూ గాలి తగిలేలా ఉండే, తక్కువ తేమ ఉన్న బాక్సుల్లో లేదా ఫ్రిజ్ షెల్ఫుల్లో పెట్టాలి.
Image credits: Getty
Telugu
వెజిటబుల్ బాస్కెట్‌లో ఈ తప్పు వద్దు!
ఫ్రిజ్‌లోని వెజిటబుల్ బాస్కెట్‌లో అన్ని కూరగాయల మధ్య కొత్తిమీరను కుక్కి పెట్టొద్దు. ఇలా ఇరికించడం వల్ల గాలి ఆడక వెంటనే పాడైపోతుంది.
Image credits: Getty
Telugu
ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
కొత్తిమీర కట్టకు కాస్త గాలి తగిలేలా, ఇతర కూరగాయలకు కొంచెం దూరంగా పెట్టండి. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు, మీ కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఘుమఘుమలాడుతుంది!