Peanut Chutney: హోటల్ స్టైల్ లో ఇడ్లీ, దోశెకు అదిరిపోయే పల్నీ చట్నీ
food-life Jun 18 2026
Author: Nandini Arava Image Credits:stockphoto
Telugu
కావాల్సిన పదార్థాలు
ఒక కప్పు పల్లీలు, 2-3 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు, నూనె, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి.
Image credits: Getty
Telugu
స్టెప్ 1
ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి పల్లీలను దోరగా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి.
Image credits: gemini ai
Telugu
స్టెప్ 2
ఇప్పుడు మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత పల్లీల పొడిని కూడా వేసి కలపాలి.
Image credits: gemini ai
Telugu
స్టెప్ 3
ఇక పోపు కోసం... నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి.
Image credits: gemini ai
Telugu
స్టెప్ 4
రెడీ అయిన ఈ పోపును చట్నీలో కలపాలి. అంతే, హోటల్ స్టైల్ పల్లి చట్నీ రెడీ. వేడివేడి ఇడ్లీ, దోశలతో సర్వ్ చేస్తే అదుర్స్.