Food
చాలా మంది పాలలో అరటిపండును వేసుకుని తింటుంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ మంచిది కాదు. ఇలా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
పాలతో పాటుగా సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదు. ముఖ్యంగా నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను పాలతో పాటు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
పాలతో పాటుగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే పుచ్చకాయ వంటి పండ్లను కూడా తినకూడదు. ఒకవేళ తింటే గ్యాస్, అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
కారం కారంగా ఉండే ఆహారాలను ఎప్పుడూ కూడా పాలతో పాటుగా తీసుకోకూడదు.వీటిని కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణ ప్రక్రియను నెమ్మదిగా అవుతుంది.
పాలను, చేపలను కలిపి తింటే జీర్ణ సమస్యలతో పాటుగా స్కిన్ అలెర్జీ కూడా వస్తుంది.
పాలను, గుడ్లను పొరపాటున కూడా కలిపి తినకూడదు.ఎందుకంటే దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించి తిన్నది సరిగ్గా అరగదు.
ఆకు కూరలు అంటే మెంతి కూర, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను పాలతో పాటు తినకూడదు. ఇలా తింటే కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి.