Food

ఇలా చేస్తే.. అరటిపండ్లు వారమైనా ఫ్రెష్ గా, పాడవకుండా ఉంటాయి

అరటిపండ్లు

కొనుకున్ని ఇంటికి తెచ్చిన 2-3 రోజుల్లోనే అరటిపండ్లు పాడైపోతుంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే నల్లగా అవుతాయి. ఇలా కాకుండా అరటిపండ్లు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాడను చుట్టండి

అరటి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ుండాలంటే వాటి కాడలను ప్లాస్టిక్ చుట్టు లేదా కాగితంతో నిండుగా చుట్టండి. 

వెనిగర్ వాడండి

అరటి పండ్లు చాలా రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిపై కొద్దిగా వెనిగర్ ను రాయండి. 

సూర్యకాంతి నుండి దూరంగా

ఎండకు ఉంటే అరటిపండ్లు తొందరగా పాడవుతాయి. నల్లగా అవుతాయి.అందుకే వీటిని ఇంట్లో నిల్వ చేసేటప్పుడు ఒక గుడ్డలో చుట్టి పెట్టండి. 

వేలాడదీయండి

అరటిపండ్లను పండ్ల బుట్టలో ఒకదానిపై ఒకటి పెడితే తొందరగా పాడవుతాయి.అలాగే వాటి తొక్క నల్లగా అవుతుంది. అందుకే అరటిపండ్లను ఎప్పుడూ బాగా గాలి తగిలే ప్రదేశంలో వేలాడదీయండి.

ఫ్రిజ్‌లో వద్దు

అరటిపండ్లను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే వాటి కాడల నుంచి ఇథిలీన్ వాయువు రిలీజ్ అవుతుంది. దీంతో అరటిపండ్ల తొక్క నల్లగా మారుతుంది. 

సోడా నీటిలో నానబెట్టండి

అరటిపండ్లను కొన్ని రోజులు తాజాగా ఉంచాలనుకుంటే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే నీరు, సోడా మిశ్రమంలో 5-10 నిమిషాల పాటు నానబెట్టండి.

ఇతర పండ్లకు దూరంగా ఉంచండి

అరటి పండ్లు ఫ్రెష్ గా ఉండాలంటే వీటిని వేరే పండ్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే చాలా పండ్లు ఇథిలీన్ వాయువును రిలీజ్ చేస్తాయి. దీనివల్ల అరటిపండ్లు త్వరగా పాడైపోతాయి. 

పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగితే ఏమౌతుంది?

చికెన్ కి మించిన ప్రోటీన్ కావాలా? ఇవి తినాల్సిందే

చక్కెర కాదు పాలలో పసుపు కలుపుకుని తాగండి.. బోలెడు లాభాలున్నాయి

మధ్యాహ్నం మాత్రమే పెరుగు తింటే ఏమౌతుందో తెలుసా?