Food

ఆలు తొక్కతో ఇన్ని లాభాలున్నాయా?

ఎన్ని పోషకాలో..

బంగాళదుంప తొక్కలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు చాలా ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే  ఈ పోషకాలు మనకు అందుతాయి.

 

సహజ ఎరువు

బంగాళా దుంప తొక్కలను కంపోస్ట్‌లో కలపవచ్చు, ఇది నత్రజని , పొటాషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొక్కలకు మంచి ఎరువుగా మారుతుంది.

క్లీనింగ్..

ఈ బంగాళ దుంప తొక్కలతో మనం చాలా వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా వెండి పాత్రలు, తుప్పు పట్టిన పాత్రలను దీనితో రుద్దితో.. మళ్ల కొత్త వాటిలా మెరుస్తాయి.

 

 

చర్మ సంరక్షణలో వాడండి

బంగాళా దుంప తొక్కలను మీ చర్మంపై రుద్దడం వల్ల ముఖం దురద, దద్దుర్లు లేదా కీటకాల కాటు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది నల్లటి మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

బూట్లు పాలిష్

బంగాళా దుంప తొక్కలను బూట్లు పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీ బూట్లపై తొక్కల లోపలి భాగాన్ని రుద్దడం వల్ల అవి మెరుస్తాయి.

కళ్ళ కింద నల్లటి వలయాలు

బంగాళా దుంప తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం తొక్కలను మీ కళ్ళ కింద దాదాపు 15 నిమిషాలు ఉంచండి.

బెస్ట్ స్నాక్స్

మీరు బంగాళా దుంప తొక్కలను కాల్చి క్రిస్పీ చిప్స్‌గా తయారు చేసుకోవచ్చు. దానిపై కొంచెం మసాలా చల్లుకోండి. ఇవి ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన  రుచికరమైన స్నాక్ అవుతుంది.

తేనెతో కలిపి అస్సలు తినకూడనివి ఇవే

రోజూ లవంగాలు తింటే ఏమౌతుంది?

షుగర్ తీసుకోవడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?

ఇవి తింటే ఈజీగా బరువు తగ్గుతారు