Food
చాలా మంది ఇష్టంగా తినే చేపల్లో సార్డినెస్ చేపలు ఒకటి. ఈ చేపల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఎ, విటమిన్ బిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
సార్డినెస్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.అలాగే రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
చేపల ఫ్రైని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే సార్డినెస్ చేపల ఫ్రైని ఒక విధంగా చేస్తే మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదు.
ఈ చేపల ఫ్రైని చేయడానికి మీరు 5 సార్డినెస్ చేపలను తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోండి.
ఈ చేపల ఫ్రైని తయారుచేయడానికి 1 టీస్పూన్ మిరపపొడి, 1/2 టీస్పూన్ పసుపు,1 టీస్పూన్ మిరియాల పొడిని తీసుకోండి.
అలాగే చేపల ఫ్రై టేస్టీగా అయ్యేందుకు 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారుచేయండి. అలాగే దీంట్లోకి 1 టీస్పూన్ నిమ్మరసం , తగినన్ని కరివేపాకు రెబ్బలు, ఉప్పు,నూనె తీసుకోండి.
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బాగా కలపండి. వీటిని సార్డినెస్ చేపలకు పట్టించి కాసేపు ఫ్రిజ్ లో పెట్టండి.
ఈ చేపల్ని ఫ్రిజ్ లో నుంచి తీసిన తర్వాత ఒక ఫ్రైయింగ్ పాన్‌లో నూనె వేసి వేయించండి. అంతే కేరళ స్టైల్ సార్డినెస్ చేపల ఫ్రై రెడీ అయినట్టే.